
MaheshBabu : సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి.. మహేష్ బాబు నివాళులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా తనయుడు మహేష్ బాబు నివాళులు అర్పించారు.
ఈ మేరకు భార్య నమ్రతతో కలిసి తల్లిదండ్రులు కృష్ణ, ఇందిరాలకు పుష్పాంజలి సమర్పించారు.
టాలీవుడ్ సినీ పరిశ్రమలోని దిగ్గజ నటుల్లో సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఒకరు. తెలుగులో జేమ్స్ బాండ్, కౌబాయ్ అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
సినీ కేరీర్ లోనే ఏకంగా 350 వరకు సినిమాల్లో హీరోగా నటించి, కోట్లాది ప్రేక్షకులను రంజింపజేసిన నటుడు కృష్ణ.
అద్భుతమైన విలక్షణ శైలితో, ఆకట్టుకునే అభినయంతో ఎన్నో సూపర్ హిట్ విజయాలు సొంతం చేసుకున్నారు.
తెలుగు ప్రేక్షకాభిమానుల గుండెల్లో సూపర్ స్టార్ హీరోగా స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
Details
నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా విలక్షణ శైలిని చాటుకున్న హీరో కృష్ణ
గతేడాది ఇదే రోజున గుండెపోటుతో కృష్ణ మరణించారు. బుధవారం ఆయన ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లో కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ మేరకు ఘట్టమనేని మహేష్ బాబుతో పాటు భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో పాటు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సూపర్ స్టార్ కృష్ణకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ సినిమాలను, ఆయన సేవలను స్మరించుకున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో సినీ మహానుభావులన్నా, తెలుగు సినిమా రేంజ్ పెంచింది మాత్రం కృష్ణనే అనే పేరుంది.
ఈ క్రమంలోనే తెలుగు సినిమాను ఆయన కొత్త పుంతలు తొక్కించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ప్రతిభను చాటుకుని తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేశారు.