
Mohanlal: 'ఎల్ 2: ఎంపురాన్' వివాదంపై స్పందించిన సూపర్ స్టార్.. క్షమాపణలు తెలిపిన మోహన్‌లాల్
ఈ వార్తాకథనం ఏంటి
తాను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ఎల్ 2: ఎంపురాన్ (L2: Empuraan) పై ఏర్పడిన వివాదంపై మోహన్‌లాల్ (Mohanlal) స్పందించారు.
సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఆయన, క్షమాపణలు చెబుతూ కీలక ప్రకటన చేశారు. సినిమాలో రాజకీయం, సామాజిక అంశాలు కొన్ని భాగమయ్యాయి.
దీంతో నాకు ప్రియమైన కొందరిని అవి బాధించాయి. తన సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని, మతాన్ని కించపరచకుండా ఉండవన్నారు.
అందుకే తన చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతున్నానని, సంబంధిత సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని తాము నిర్ణయించుకున్నామన్నారు.
నాలుగు దశాబ్దాలుగా మీతో ఉన్నానని, మీ ప్రేమ, నమ్మకమే తన బలమని అభిమానులను ఉద్దేశించి మోహన్‌లాల్ పేర్కొన్నారు.
Details
కేరళ ముఖ్యమంత్రిని నుండి మద్దతు
సినిమాపై వివాదం కొనసాగుతున్న సమయంలో, కేరళ సీఎం పినరయి విజయన్ 'ఎంపురాన్' సినిమాను కుటుంబంతో కలిసి వీక్షించారు.
చిత్ర బృందానికి మద్దతు ప్రకటిస్తూ, భావప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
అసలేం జరిగింది?
2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్లను ఆధారంగా చేసుకుని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
అల్లర్ల సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం, కొంతకాలానికి అతడే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి అంశాలు ఉన్నాయి.
ఈసన్నివేశాలు ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపేలా ఉన్నాయని పలువురు విమర్శించారు.
దీంతో, సినిమా నిలిపివేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ వివాదంపై నిర్మాత గోకులం గోపాలన్ స్పందించగా, తాజాగా మోహన్‌లాల్ కూడా తన అభిప్రాయం వెల్లడించారు.