
Chiranjeevi Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర' సెట్ లో మరో హీరోయిన్ ..-ఆమె ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి,కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఈ చిత్రానికి బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే ఈ షూటింగ్ సంబంధించి ఓ సూపర్ డూపర్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
శర్వానంద్ హీరోగా నటించిన 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాలో హీరోయిన్ సురభిని 'విశ్వంభర' సినిమాలో ఓ పాత్రకు ఎంపిక చేసినట్టు తెలిసింది.
Details
'విశ్వంభర' కోసం హైదరాబాద్ లో 13 సెట్స్
'ఓటర్' తర్వాత తెలుగు ఆమె నటిస్తున్న చిత్రమిది. సురభిని ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇప్పటికే, 'విశ్వంభర' కోసం హైదరాబాద్ లో 13 సెట్స్ వేశారు.చిరంజీవి, త్రిష మీద కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించారు.
ఇప్పటికే, ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం సుమారు 18 కోట్లకు పైగా కోట్ చేసినట్లు సమాచారం.
విలన్, మరొక హీరోయిన్ వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.