Page Loader
Surya 46 : నేటి నుంచి 'సూర్య 46' షూటింగ్ ప్రారంభం.. కొత్త పోస్టర్ వైరల్ !
నేటి నుంచి 'సూర్య 46' షూటింగ్ ప్రారంభం.. కొత్త పోస్టర్ వైరల్ !

Surya 46 : నేటి నుంచి 'సూర్య 46' షూటింగ్ ప్రారంభం.. కొత్త పోస్టర్ వైరల్ !

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్ హీరో సూర్య కి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. వరుస పరాజయాల మధ్య అతని కెరీర్ సంక్షోభంలోకి వెళ్తోంది. తాజాగా విడుదలైన "రెట్రో" సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నా, చివరికి అది నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉండగా, సూర్య ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి తాత్కాలికంగా "సూర్య 46" అనే టైటిల్‌ను ఉపయోగిస్తున్నారు.

వివరాలు 

"The Celebration Begins"

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. తాజాగా చిత్ర బృందం పళని మురుగన్ దేవస్థానాన్ని సందర్శించిన అనంతరం, షూటింగ్‌ను మొదలుపెట్టింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో సూర్య వెనుకవైపు ఉన్న లుక్‌లో కనిపించగా, "The Celebration Begins" అనే క్యాప్షన్‌ కనిపించింది. ఈ చిత్రంలో సూర్యకి జోడీగా మమితా బైజు నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సూర్య 46' షూటింగ్ ప్రారంభం