Suriya: 'రోలెక్స్' మూవీ గురించి సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'విక్రమ్'. 2022లో విడుదలైన ఈ చిత్రంలో సూర్య 'రోలెక్స్' పాత్రతో ఎంటర్ అయ్యారు, ఇది ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. మాదక ద్రవ్యాల గ్యాంగ్‌లీడర్‌గా ఆయన పండించిన విలనిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 'రోలెక్స్' పాత్ర ఆధారంగా ఒక పూర్తిస్థాయి సినిమాను తీసుకుంటానని లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో 'కంగువ' ప్రమోషన్స్‌లో సూర్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను నటించిన ఓ సినిమాలో 'రోలెక్స్' పాత్రకు సంబంధం ఉందని తెలిపారు.
సూర్య మూడు విభిన్న లుక్స్‌లో
"1986లో విడుదలైన 'విక్రమ్'తో 2022లో వచ్చిన 'విక్రమ్'కు ఏవిధంగా లింక్ ఉందో అదే విధంగా 'రోలెక్స్'తో కూడా నేను నటించిన ఒక సినిమాకు కనెక్షన్ ఉంది" అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ సినిమా ఏమై ఉంటుందా? అని 'ఎక్స్' వేదికపై పలువురు నెటిజన్లు చర్చిస్తున్నారు. సూర్య నటించిన తాజా చిత్రం 'కంగువ'. శివ దర్శకుడు, స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సూర్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారు.దిశాపటానీ కథానాయికగా నటిస్తున్నారు,బాబీ డియోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్లో ఇప్పటివరకు తెరపైకి రాని కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాని చిత్రీకరించినట్లు సమాచారం.
నవంబర్ 14న 'కంగువ' విడుదల
'కంగువ' నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు రూ.2000 కోట్లు వసూలుచేస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు సూర్య. ఇందులో సినిమా విశేషాలు, కొత్త ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. 'రోలెక్స్' గురించి కూడా మాట్లాడారు. లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం 'కూలీ' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తాను (లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) ఎల్సీయూ హీరోలందరితో కలిసి అదిరిపోయే మూవీ చేయాలని ఇటీవల చెప్పారు.
రోలెక్స్'పై ఒక స్టాండలోన్ మూవీ
'విక్రమ్'ను అద్భుతంగా పూర్తి చేసేందుకు 'రోలెక్స్' సీన్స్‌ను క్రియేట్ చేశాను. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్ దృష్టిలో ఉంచుకుని 'రోలెక్స్'పై ఒక స్టాండలోన్ మూవీ చేయాలని అనుకుంటున్నాను. 'కూలీ' పూర్తి చేసిన తర్వాత, LCUలోని హీరోలందరితో పీక్ ఎల్సీయూ మూవీ చేయనున్నాను" అని తెలిపారు.