Page Loader
Kanguva Update: రేపు సాయంత్రం 4గంటలకు 'కంగువ' టీజర్ 
రేపు సాయంత్రం 4గంటలకు 'కంగువ' టీజర్

Kanguva Update: రేపు సాయంత్రం 4గంటలకు 'కంగువ' టీజర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2024
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కంగువ'మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను రేపు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రూ.350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 11న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 10 బాషలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు,యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్స్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. రెండు భాగాలుగా వస్తున్నకంగువా పార్ట్‌-1 2024లోనే విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్