Page Loader
Suriya : టాలీవుడ్ లో సూర్య స్ట్రెయిట్ ఎంట్రీ .. దర్శకుడు ఎవరేంటే.? 
టాలీవుడ్ లో సూర్య స్ట్రెయిట్ ఎంట్రీ .. దర్శకుడు ఎవరేంటే.?

Suriya : టాలీవుడ్ లో సూర్య స్ట్రెయిట్ ఎంట్రీ .. దర్శకుడు ఎవరేంటే.? 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ హీరో సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా అతని సినిమాలు మంచి మార్కెట్‌ ఉంది. ఇంకా చెప్పాలి అంటే, తమిళ్ కంటే తెలుగు మార్కెట్‌లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. గతేడాది రీరిలీజ్ అయిన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తాడా? అనే అంశంపై అభిమానులు ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో "కంగువ" ప్రమోషన్ సమయంలో సూర్య కూడా త్వరలోనే ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందనే వార్తలు టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తున్నాయి.

వివరాలు 

కాంబినేషన్ కన్నా, కథకే ఎక్కువ ప్రాధాన్యత

సూర్య స్ట్రయిట్ తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను ఏ దర్శకుడు డైరెక్ట్ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి గతంలో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సినిమా చేస్తున్నాడని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. కానీ, అవన్నీ నిజం కాలేదు. గతేడాది "కంగువా" భారీ పరాజయాన్ని ఎదుర్కొనడంతో, సూర్య ప్రస్తుతం కథ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాంబినేషన్ కన్నా, కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

వివరాలు 

సూర్య చేయబోయే  సినిమాకి అగ్ర దర్శకుల జాబితా 

వినిపిస్తున్న టాక్ ప్రకారం, సూర్య సినిమా చేయబోయే దర్శకుల జాబితాలో బోయపాటి శ్రీను, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, "తండేల్" దర్శకుడు చందు మొండేటి పేర్లు ఉన్నాయి. మరి, వీరిలో ఎవరు సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారనేది కొంతకాలం వేచి చూడాల్సిందే.