LOADING...
Suriya46 : వెంకీ అట్లూరి డైరక్షన్‌లో 'సూర్య' మూవీ.. ఓటీటీలో భారీ డీల్!
వెంకీ అట్లూరి డైరక్షన్‌లో 'సూర్య' మూవీ.. ఓటీటీలో భారీ డీల్!

Suriya46 : వెంకీ అట్లూరి డైరక్షన్‌లో 'సూర్య' మూవీ.. ఓటీటీలో భారీ డీల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో 'సూర్య' ప్రస్తుతం తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు డైరెక్టర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. ఇటీవల సూర్య బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌కు ఫ్యాన్స్ అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించడం మరింత హైలైట్‌గా మారింది.

Details

'విశ్వనాధం అండ్ సన్స్' అనే టైటిల్‌ పరిశీలన

ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు 'విశ్వనాధం అండ్ సన్స్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అయితే, సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్‌లో ఉన్నప్పటికీ, ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చి పడింది. సూర్య గత సినిమా రెట్రో ప్లాప్ అయినా, దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన సార్, లక్కీ భాస్కర్ సినిమాలు ఓటీటీలో ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా లక్కీ భాస్కర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే వరల్డ్‌వైడ్‌గా ఒక నెలపాటు టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. దీని ప్రభావం ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా పడింది.

Details

రూ.80 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్లు టాక్

దీంతో నెట్‌ఫ్లిక్స్ ముందుగానే రూ.80 కోట్లు వెచ్చించి ఈ సినిమాకి హక్కులు సొంతం చేసుకుంది. ఈ డీల్‌తో నిర్మాత నాగవంశీకి నిజంగానే జాక్‌పాట్ తగిలిందని చెప్పొచ్చు. మినిమం బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఓటీటీ డీల్ ద్వారానే నిర్మాతకు భారీ లాభాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ 'మమిత బైజు' హీరోయిన్‌గా నటిస్తుండగా, జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు.