Page Loader
Surya: పళని మురుగన్ వద్దకు సూర్య,వెంకీ అట్లూరి.. 
పళని మురుగన్ వద్దకు సూర్య,వెంకీ అట్లూరి..

Surya: పళని మురుగన్ వద్దకు సూర్య,వెంకీ అట్లూరి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ హీరో సూర్య తాజాగా తెలుగులో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 'వాతి', 'లక్కీ భాస్కర్' వంటి హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఇందులో సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తున్నారు.ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగ వంశీ కలిసి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు.

వివరాలు 

కొత్త గెటప్‌లో సూర్య 

వారు సినిమా స్క్రిప్ట్‌తో అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో సూర్య కొత్త గెటప్‌లో దర్శనమిచ్చారు. ఇదే గెటప్ సినిమాలోనూ కనిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఆలయంలో సూర్య, వెంకీ అట్లూరి ఇద్దరూ సంప్రదాయ పంచెకట్టులో దర్శనమిచ్చారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుండగా, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం రూంపొందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్‌ను పూర్తిచేయాలని బలంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేసిన ట్వీట్