Swayambhu: స్వయంభు మ్యూజిక్ ప్లానింగ్.. నిఖిల్, రవి బస్రూర్ కలిసి ఏం చేస్తున్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ తెలుగు చిత్రసీమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న నటుల్లో ఒకరు.
తాజాగా నిఖిల్ తన తొలి పాన్ ఇండియా సినిమా 'స్వయంభు'లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నిఖిల్ కెరీర్‌లో 20వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో, మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ఫీమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది.
ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. నిఖిల్ తన టీంతో కలసి కర్ణాటకలోని బస్రూర్‌లో ఉన్న రవి బస్రూర్ స్టూడియోను సందర్శించారు.
వారితోపాటు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఈ స్టూడియోలో సందడి చేశారు.
Details
ఈ ఏడాదే రిలీజ్
మ్యూజిక్ సిట్టింగ్స్‌లో నిమగ్నమైన రవి బస్రూర్ టీం, స్వయంభుకు శక్తివంతమైన సంగీతాన్ని అందించేందుకు పునర్వ్యవస్థీకరణలో ఉంది.
నిఖిల్ తమ అనుభవాన్ని పంచుకుంటూ 'పవర్‌ఫుల్ ఎపిక్ మ్యూజిక్‌ను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి' అంటూ ఫొటోలను షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.
ఈ భారీ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకులకు 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.