Tollywood: తెలుగు నిర్మాతలతో చేతులు కలుపుతున్న బాలీవుడ్ నిర్మాతలు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న బ్యానర్ అంటే మైత్రీ మూవీ మేకర్స్. అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ఎదురు చూసే పుష్ప 2, రెబెల్ స్టార్ ప్రభాస్,హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' చిత్రాలను కూడా మైత్రీ నిర్మాతలు నిర్మిస్తున్నారు.
అదేవిధంగా, కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్‌తో రూపొందుతున్న డ్రాగన్ సినిమాను కూడా మైత్రీ నిర్మిస్తోంది.
ఈ విధంగా, పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు అన్ని మైత్రీ చేతిలో ఉన్నాయి.
ఇప్పుడు తెలుగు సినిమాలు హిందీని మించిన కలెక్షన్లను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు తెలుగు స్టార్ హీరోలపై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి.
వివరాలు
టీ-సిరీస్,మైత్రీ మూవీస్‌తో సంయుక్తంగా పని చేస్తున్నట్లు వార్తలు
ఇందులో భాగంగా, బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ టాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌తో సంయుక్తంగా పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డికి చెందిన భద్రకాళి ప్రోడాక్టన్స్‌తో కలసి 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలను నిర్మించారు.
ఇప్పుడు మైత్రీతో టీ-సిరీస్ ఒక దీర్ఘకాల ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తమిళ స్టార్ హీరో అజిత్‌తో మైత్రీ మూవీస్ నిర్మించే 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో కూడా టీ-సిరీస్ భాగస్వామ్యంగా వ్యవహరించింది.
ఆడియో హక్కులను భూషణ్ కుమార్ కొనుగోలు చేశారు. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను కూడా టీ-సిరీస్ నిర్మించింది.