Page Loader
Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి కూతురాయేనే..బాయ్ ఫ్రెండ్‌తోనే మూడు ముళ్లు
బాయ్ ఫ్రెండ్‌తోనే మూడు ముళ్లు

Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి కూతురాయేనే..బాయ్ ఫ్రెండ్‌తోనే మూడు ముళ్లు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 15, 2023
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ సహా బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 33 ఏళ్ల ఈ హాట్ స్టార్, ముడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు ప్రియుడు విజయ్ వర్మతో జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధం అవుతోంది. నానీ హీరోగా నటించిన 'MCA'లో విల‌న్ గా విజ‌య్ వర్మ అద్భుతంగా నటించి మార్కులు కొట్టేశారు. అయితే తాజాగా తమన్నా, విజయ్ తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేశారు. అయితే వివాహం మాత్రం ఇప్పట్లో లేదని చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పెద్దల ఒత్తడితో వచ్చే జనవరిలో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

details

తమన్నా వయసు 33, బాయ్ ఫ్రెండ్ వయసు 37 వయసు

ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా ఈ ఇద్దరి పెళ్లి వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి.వచ్చే ఫిబ్ర‌వరిలో ఈ ప్రేమపక్షలు మూడు ముళ్ల బంధంతో సంసార సాగరాన్ని ఈదనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమన్నావ‌య‌సు 33 కాగా, విజయ్ వర్మకు 37 ఏళ్లు.వయసు కరిగిరపోతోందని ఇంటి పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. చేసేది లేక ఈ ప్రేమ జంట పెళ్లికి ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.ఇదే సమయంలో పెళ్లి గురించి అధికారికంగా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా తమన్నా, విజయ్ వర్మ కలిసి 'లస్ట్ స్టోరీస్ 2'లో నటించారు. 2018లో విడుదలైన ఈ వెబ్ స్టోరీ ప్రేక్షకాదరణ పొందింది. లస్ట్‌ స్టోరీస్‌' వెబ్ స్టోరీకి కొనసాగింపుగా 'లస్ట్‌ స్టోరీస్‌ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.