
Odela 2 : పవర్‌ఫుల్ పాత్రలో తమన్నా.. 'ఓదెల 2' రిలీజ్ డేట్ ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నేళ్లైనా, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్‌తో కూడిన పాత్రలు చేస్తూ కొత్త అవతారాలు ఎత్తుతోంది.
హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, ప్రయోగాత్మక సినిమాలకు కూడా రెడీగా ఉంటుంది. 'అరణ్మనై 4'లో భయానక దెయ్యంగా, 'లస్ట్ స్టోరీస్ 2'లో సాహసోపేతమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది.
'జైలర్', 'స్త్రీ 2' వంటి చిత్రాల్లో కూడా కీలక పాత్రలు పోషించింది. ఇప్పుడు 'ఓదెల 2' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Details
ఏప్రిల్ 17న రిలీజ్
ఇంతకుముందు ఓటిటిలో భారీ హిట్ అయిన 'ఓదెల రైల్వే స్టేషన్'కు సీక్వెల్‌గా 'ఓదెల 2'ను భారీగా ప్లాన్ చేశారు.
ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించగా, ప్రముఖ నిర్మాత సంపత్ నంది దీనిని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తికాగా, తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 17న 'ఓదెల 2' థియేటర్లలో సందడి చేయనుంది.
చిత్రబృందం ఈ నెలాఖరులో ప్రొమోషన్స్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.