LOADING...
Kamal Haasan: ఆ విషయంలో తమిళనాడు ఒంటరి కాదు.. ఆంధ్ర, కర్ణాటకకు అండగా ఉంటా : కమల్‌ హాసన్
ఆ విషయంలో తమిళనాడు ఒంటరి కాదు.. ఆంధ్ర, కర్ణాటకకు అండగా ఉంటా : కమల్‌ హాసన్

Kamal Haasan: ఆ విషయంలో తమిళనాడు ఒంటరి కాదు.. ఆంధ్ర, కర్ణాటకకు అండగా ఉంటా : కమల్‌ హాసన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మక్కల్ నీది మయ్యం (ఎం.ఎన్‌.ఎం) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ భాషా వివాదంపై మరోసారి గళమెత్తారు. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా అమలు చేయాలనుకుంటున్న త్రిభాషా సూత్రంపై స్పందించిన ఆయన.. పాఠశాలల్లో విద్యార్థులపై ఓ నిర్దిష్ట భాషను బలవంతంగా రుద్దడం వల్ల వారి అభ్యాస ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమిళనాడు మాత్రమే కాదు.. పంజాబ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కూడా తన మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్రం రాష్ట్రాలపై భాషను విషయంలో ఒత్తిడి తీసుకురావడం తప్పని స్పష్టంచేసిన కమల్‌ హాసన్‌.. విద్యార్ధులకు చదువులో అడ్డంకులు రాకూడదు.

Details

ద్విభాషా విధానానికి కట్టుబడి ఉన్నాం

ఒక భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలంటే స్పానిష్‌, చైనీస్‌లాంటి భాషల్నూ నేర్చుకోవచ్చు. మన దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఆంగ్ల విద్య కొనసాగుతోంది. ఒక్కసారిగా దానిని మిగిలిన భాషలతో భర్తీ చేయాలనుకుంటే దాని ప్రభావం నేరుగా విద్యార్థులపై పడుతుంది. మాపై హిందీని బలవంతంగా రుద్దితే.. మా మాతృభాష తమిళం పరిస్థితి ఏమవుతుంది? తమిళం కూడా దేశంలో ఉన్న 22 అధికారిక భాషలలో ఒకటి కాదా?" అని ఆయన ప్రశ్నించారు. ఇక ఎన్‌ఈపీ ప్రకారం విద్యార్థులు హిందీ, ఇంగ్లిష్‌, మరో స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం ఎంకే స్టాలిన్‌.. తమ ప్రభుత్వం ద్విభాషా విధానానికి కట్టుబడి ఉంటుందని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను తాము ఏకంగా నిలువరించామని స్పష్టం చేశారు.