ముంబైకి మకాం మార్చిన సూర్య ఫ్యామిలీ.. దీనిపై తమిళ సింగం ఏమన్నారో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ నటుడు సూర్య కుటుంబంతో సహా ముంబైకి తరలిపోయారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం సూర్య ఫ్యామిలీతో ముంబై మహానగరంలోనే సెటిల్ అయ్యాడని చర్చ జరుగుతోంది. దీనిపై కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య స్పందించారు.
చైన్నైలో నిర్వహించిన అభిమానుల సమావేశంలో ఇటీవలే సూర్య పాల్గొన్నారు. అయితే కుటుంబంతో కలిసి ముంబైకి మకాం మార్చారన్న వార్తలపై స్పందించాలని కోరారు.
దాంట్లో ఏమాత్రం నిజం లేదని ఆయన కొట్టిపడేశారు. తన కుమార్తె, కుమారుడు చదువుల నిమిత్తం ముంబైలో ఉంటున్నారని చెప్పుకొచ్చారు. తాను మాత్రం తమిళనాడులోనే ఉంటున్నట్లు వివరించారు.
అయితే తానో మంచి పుత్రుడిగా, మంచి తండ్రిగా, మంచి భర్తగా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
DETAILS
మాధవన్‌తో కలిసి గత కొంత కాలంగా గోల్ఫ్ ఆడుతున్నా : సూర్య
జీవితంలో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నటుడు మాధవన్‌తో కలిసి గత కొంత కాలంగా గోల్ఫ్ ఆడుతున్నానని సూర్య అన్నారు. ప్రస్తుతం 'కంగువ' అనే సినిమాలో నటిస్తున్నారు ఈ తమిళ సింగం.
ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న కంగువలో సూర్య విభిన్న పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చర్చిస్తున్నాయి.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటీమణి దిశా పటానీ నటిస్తున్నారు. త్రీడీ మోషన్ లో వస్తున్న ఈ సినిమా దాదాపుగా 10కిపైగా భారతీయ భాషల్లో రూపొందుతోంది. 2024లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.