Page Loader
Thandel: 'తండేల్' ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి' వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! 
'తండేల్' ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి' వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Thandel: 'తండేల్' ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి' వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 19, 2024
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తండేల్' సినిమా, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్‌ చేస్తోంది. ఈ సినిమాపై ఆసక్తి పెరిగడంతో తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన అప్‌డేట్‌ అభిమానులను మరింత ఉత్సాహపరచింది. మూవీకి సంబంధించి 'బుజ్జి తల్లి' అనే ఫస్ట్ సింగిల్ నవంబర్ 21న విడుదల కానుంది. ఈ పాట పోస్టర్‌లో హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల మన్ననలు పొందేలా ఉంది. గడ్డంతో రగ్గడ్ లుక్‌లో చైతన్య కనిపిస్తుండగా, హాఫ్ శారీలో సాయి పల్లవి అందం ఆకట్టుకుంటోంది. ఈ చిత్ర కథ సముద్రంపై జీవనం సాగించే ఓ భర్త, తనను శత్రుదేశం బందీగా తీసుకెళ్లిన తర్వాత భార్య ఎదుర్కొనే ఆరాటం చుట్టూ తిరుగుతుంది.

Details

భారీగా ఓవర్సీస్ రేట్లు

వినూత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, గీతా ఆర్ట్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తండేల్‌ మూవీ పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా బిజినెస్ పరంగా కూడా భారీ విజయం సాధిస్తోంది. ఓటీటీ రైట్స్ రూ.40 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.6.5 కోట్లకు విక్రయమయ్యాయి. 'లవ్ స్టోరీ' తర్వాత నాగ చైతన్యకు సరైన హిట్‌ లేదు. 'థాంక్యూ', 'కస్టడీ' చిత్రాలు విఫలమవడంతో ఆయన కెరీర్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇక తండేల్‌ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.