
Tanya Ravichandran: ప్రేమలో తాన్యా రవిచంద్రన్.. గౌతమ్‌తో లిప్‌లాక్ ఫోటో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార చెల్లెలిగా కనిపించిన తాన్యా రవిచంద్రన్ గుర్తున్నదా? చిన్నదైనా మనసులో నిలిచిపోయే పాత్రలో మెరిసిన ఈ అందాల భామ, ఆ తరవాత తమిళ చిత్రాలతో పాటు తెలుగులో 'పేపర్ రాకెట్' వెబ్‌సిరీస్ ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం తాన్యా అడపాదడపా సినిమాలు చేస్తూ తన కెరీర్‌లో నిలకడగా ముందుకు సాగుతోంది. తాజాగా తాన్యా తన ప్రేమను అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది. అందులో తన ప్రియుడిని లిప్‌లాక్ చేస్తూ కనిపించిన తాన్యా, 'ఒక ముద్దు.. ఒక ప్రామిస్.. ఎప్పుడూ.. ఎప్పటికీ కలిసే..' అనే క్యాప్షన్‌తో పాటు#SoonToBeMarried అనే హ్యాష్‌ట్యాగ్ కూడా జతచేసింది.
Details
తాన్యాకు శుభాకాంక్షల వెల్లువ
తాన్యా మనసు దోచుకున్న వ్యక్తి మరెవరో కాదు... కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్. ఈయన ఐ, మదిల్ మేల్ కాదల్, అన్నాబెల్లే సేతుపతి వంటి చిత్రాలకు డీవోపీగా పని చేశారు. తమిళ పరిశ్రమలో క్రియేటివ్ టెక్నీషియన్‌గా మంచి పేరున్న గౌతమ్, త్వరలో తాన్యా మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఈ వార్తతో తాన్యా & గౌతమ్ ప్రేమకథ నెట్టింట్లో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, కొంతమంది అభిమానులు మాత్రం 'ఇప్పుడే పెళ్లా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంట త్వరలోనే గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తోందన్న సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.మొత్తానికి తాన్యా రవిచంద్రన్‌కి ఓ కొత్త జీవన ప్రయాణం ప్రారంభం కానుంది!