నేనేమి ప్రెగ్నెంట్ కాదు పెళ్ళి చేసుకోవడానికి: పెళ్ళిపై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు
గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాలకు దూరమైన తాప్సీ పన్ను, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది. అటు సినిమాలతో బిజీగా ఉంటున్న తాప్సీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా పెళ్లి మీద తాప్సీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన తాప్సీ, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఒకానొక అభిమాని అడగడంతో.. పెళ్లి చేసుకోవడానికి తానేమి ప్రెగ్నెంట్ కాదని, అయినా పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచన లేదని, భవిష్యత్తులో చేసుకుంటే తప్పకుండా చెబుతానని అంది. ఈ మాటలు నెటిజన్లను షాకయ్యేలా చేసాయి.
వరల్డ్ టూర్ లో బిజీగా ఉన్న తాప్సీ
ప్రెగ్నెంట్ అయితే పెళ్లి చేసుకోవడం ఏంటని కొందరు నెటిజెన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకొందరేమో తాప్సీ ఎవరినో ఉద్దేశించి మాట్లాడిందని కామెంట్లు పెడుతున్నారు. ఏదైతేనేం ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకోవడమనే తాప్సీ మాటలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసాయి. ప్రస్తుతం తాప్సీ వరల్డ్ టూర్ లో బిజీగా ఉంది. అమెరికా, డెన్మార్క్ దేశాల్లో పర్యటించిన తాప్సీ, మరిన్ని దేశాలను చుట్టి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. తెలుగులో తాప్సీ చేసిన చివరి చిత్రం మిషన్ ఇంపాజిబుల్ 2022లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఆమె సినిమా చేయలేదు.