Page Loader
Odela 2: మహా కుంభమేళాలో 'ఓదెల 2' టీజర్ రిలీజ్.. అంచనాలను పెంచేసిన మూవీ టీం
మహా కుంభమేళాలో 'ఓదెల 2' టీజర్ రిలీజ్.. అంచనాలను పెంచేసిన మూవీ టీం

Odela 2: మహా కుంభమేళాలో 'ఓదెల 2' టీజర్ రిలీజ్.. అంచనాలను పెంచేసిన మూవీ టీం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

కరోనా కాలంలో విడుదలై మంచి స్పందన అందుకున్న 'ఓదెల రైల్వే స్టేషన్‌' సినిమాకు సీక్వెల్‌గా 'ఓదెల 2' రూపొందుతోంది. ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రచన సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇప్పటికే టీజర్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 22న మహా కుంభమేళాలో 'ఓదెల 2' టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహా కుంభమేళాలో లాంచ్ కానున్న తొలి టీజర్ ఇదే కావడం విశేషం.

Details

నాగసాధుగా తమన్నా

టీజర్ విడుదలను పురస్కరించుకుని మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా విడుదలైన టీజర్ అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చిత్రంలో తమన్నా నాగసాధుగా కనిపిస్తుండగా, ఆమె లుక్ డివైన్ వైబ్‌తో అత్యంత పవర్‌ఫుల్‌గా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ కథలో ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్టశక్తుల నుంచి ఎలా రక్షించాడన్నదే ప్రధాన కథాంశం. టీజర్ విడుదలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశముందని చిత్రయూనిట్ భావిస్తోంది. మేకర్స్ టీజర్ కట్‌ను చాలా ఇంటెన్స్, పవర్‌ఫుల్‌గా రూపొందించినట్లు సమాచారం.