Teja Sajja-Hanuman-Mirayi-New Cinema: హనుమాన్ హీరో తేజ సజ్జా కొత్త ప్రాజెక్ట్ 'మిరాయి' ఫస్ట్ పోస్టర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
హను-మాన్ సినిమాతో మూడు వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన తేజ సజ్జ ఇప్పుడు కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.
ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సోమవారం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సినిమా టైటిలే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాలో తేజ సజ్జాతోపాటుగా మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.
ఇక ఇందులో దుల్కర్ సల్మాన్ కూడ ఉంటాడని టాక్ నడుస్తోంది.
ఇంతవరకు ఈ విషయాలేమీ వెల్లడించని ఈ సినిమా మేకర్స్ సినిమా టైటిల్ ను మాత్రం ప్రకటించారు. సినిమా పేరు మిరాయి.
మిరాయి ఇదో జపనీస్ పదం అట. దీని అర్థం 'భవిష్యత్తు' అని చెబుతున్నారు.
Mirayi-Teja sajja
ఈ నెల 18న ఫస్ట్ గ్లింప్స్
కథకు అనుగుణంగానే ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు మేకర్స్.
ఈ సినిమా కు సంబంధించిన అన్ని విషయాలు ఈ నెల 18న చెబుతామని అదేరోజు సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ను కూడా విడుదల చేస్తామని తెలిపారు.
హనుమాన్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్ గా తేజా సజ్జతో జై హనుమాన్ ఉంటుందని భావిస్తున్న తరుణంలో
ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, టైటిల్ తో మరో సినిమాను ప్రకటించం పట్ల తేజ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.