సిద్ధార్థ్ రాయ్ సినిమాతో హీరోగా మారుతున్న చైల్డ్ ఆర్టిస్ట్
బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్ నటించిన సినిమాల్లో బాలనటుడిగా చేసిన దీపక్ సరోజ్, సిద్ధార్థ్ రాయ్ సినిమాతో హీరోగా మారుతున్నాడు. ఈ మేరకు సినిమా టైటిల్ ని ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో దీపక్ సరోజ్ మొహం స్పష్టంగా కనిపించట్లేదు, కానీ నోట్లో పెట్టుకున్న రెండు సిగరెట్లు, ముఖం మీద గులాబీ పువ్వు మాత్రం కనిపిస్తున్నాయి. మరో పోస్టర్ లో హీరో హీరోయిన్లు లిప్ కిస్ తో కనిపించారు. ఇది లవ్ స్టోరీ కాదు లైఫ్ స్టోరీ అని క్యాప్షన్ లో చెప్పడంతో అర్జున్ రెడ్డి లాంటి సినిమా అయ్యుంటుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలిస్తే ఎలాంటి కథతో వస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది.
హరీష్ శంకర్ టీమ్ లోంచి వస్తున్న కొత్త దర్శకుడు
తెలుగు సినిమా దర్శకుడు హరి శంకర్ టీంలో పనిచేసిన బి యశస్వి, సిద్ధార్థ్ రాయ్ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. నిజానికి సిద్ధార్థ్ రాయ్ టైటిల్ ని ముందుగా హరీష్ శంకర్ రిజిస్టర్ చేసుకున్నారట. కానీ తన టీం నుంచి ఒకరు డైరెక్టర్ అవుతుండడంతో ఆ టైటిల్ ని వాళ్లకు ఇచ్చేసినట్లు సమాచారం. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లలో సంయుక్తంగా రూపొందుతున్న ఈ సినిమాను జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మిస్తున్నారు. రాధాన్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్ గా ప్రవీణ్ పూడి ఉన్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు శ్యామ్ కె నాయుడు తీసుకున్నారు. వేసవిలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.