Page Loader
తెలుగు సినిమా: సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న ఆసక్తికరమైన సినిమాలు 
సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు

తెలుగు సినిమా: సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న ఆసక్తికరమైన సినిమాలు 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 29, 2023
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సినిమాలు సిద్ధమైపోతున్నాయి. ఆగస్టులో విడుదలైన సినిమాలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి కళ్ళన్నీ సెప్టెంబర్ మీదే ఉన్నాయి. ఈ నెలలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఆసక్తికరమైన చిత్రాలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. ఖుషి విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అలరించబోతున్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

Details

జాతి రత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టి నుండి వస్తున్న చిత్రం 

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలోకి వస్తుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. జాతిరత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టి నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. జవాన్: షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుంది. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతుంది.

Details

చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం స్కంద. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో విడుదల అవుతుంది. చంద్రముఖి 2 2005లో రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 సినిమా ప్రస్తుతం రాబోతుంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది.

Details

ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో సలార్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల అవుతుంది. అమెరికాలో ఆల్రెడీ ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ప్రభాస్ అభిమానులందరూ ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరి రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.