
పాట పాపులరైనా బాక్సాఫీసు దగ్గర విజయం తెచ్చుకోలేని చిన్న హీరోల సినిమాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగులో చిన్న సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఆ మాటకొస్తే ఏ భాషా ఇండస్ట్రీలో అయినా చిన్న సినిమాలే(బడ్జెట్ పరంగా) ఎక్కువగా ప్రేక్శకుల ముందుకు వస్తుంటాయి.
అయితే ఈ చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్ద ఒక్కోసారి తిరుగులేని విజయాన్ని సాధిస్తాయి. ఈ మధ్య బలగం సాధించినట్లు, అప్పుడప్పుడు థియేటర్లను ఒక ఊపు ఊపేస్తుంటాయి.
కొన్ని చిన్న సినిమాలయితే కొంచెం కూడా చప్పుడు చేయకుండా వెళ్ళిపోతాయి. ప్రస్తుతం, చిన్న సినిమాలుగా విడుదలై బాక్సాఫీసు దగ్గర నిరాశ పర్చిన సినిమాల్లోని పాపులర్ అయిన పాటల గురించి మాట్లాడుకుందాం.
Details
సిద్ శ్రీరామ్ పాడిన పాటలు
సో సోగా ఉన్నానులే:
మంచి రోజులు వచ్చాయి సినిమాలోని ఈ పాట, బాగా పాపులర్ అయ్యింది. అనూప్ రూబెన్స్ సంగీతం, సిద్ శ్రీరామ్ గొంతు, కృష్ణ కాంత్ పెన్ను అందరినీ ఆకట్టుకున్నాయి. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్, మెహ్రీన్ నటించారు.
ఇది చాలా బాగుందిలే:
సెహరి చిత్రంలోని ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. కిట్టు విస్సా ప్రగడ అందించిన సాహిత్యం ఈ పాటకు బాగా ప్లస్ అయ్యింది. నిన్నామొన్నపై కక్షే కట్టినా నువ్వే లేవని తెలుసా అనే చరణం, ఇన్ స్టా రీల్స్ లో బాగా పాపులర్ అయ్యింది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.
Details
ఒకే ఒక లోకం నువ్వు:
శశి చిత్రంలోని ఈ పాట, సినిమా రిలీజ్ కు ముందు ప్రేక్షకులను ఎంతో ఉర్రూతలూగించింది. ఈ పాటతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. కానీ సినిమా మాత్రం బాక్సాఫీసు దగ్గర నిరాశ పర్చింది.
కాకపోతే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకే ఒక లోకం నువ్వు అనే పాట జనాల్లో బాగా పాపులర్ కావడంతో సినిమాకు మంచి పాపులారిటీ వచ్చింది.
అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ పాటకు సిద్ శ్రీరామ్ గొంతునందించారు. సాహిత్యాన్ని ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ అందించారు.
ఆది సాయికుమార్, సురభి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్ట్ చేసారు.