LOADING...
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు 
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 24, 2023
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతీవారం ఓటీటీలో కొత్త కంటెంట్ విడుదలవుతూ ఉంటుంది. ఈ వారం కూడా సరికొత్త కంటెంట్ తో ఓటీటీ వేదికల్లో తమ సబ్ స్క్రయిబర్లను ఆనందింపచేయడానికి వచ్చేస్తున్నాయి. బ్రో: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసిన నటించిన చిత్రం బ్రో. పి సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 25వ తేదీ నుండి అందరికీ అందుబాటులో ఉండనుంది. బ్రో సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలను త్రివిక్రమ్ అందించారు.

Details

థియేటర్లను షేక్ చేసిన 'బేబి' కూడా వచ్చేస్తోంది. 

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి చిత్రం థియేటర్లలో దుమ్ము దులిపింది. చిన్న సినిమాగా విడుదలై అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆహా ప్లాట్ ఫామ్ ద్వారా ఆగస్టు 25వ తేదీ నుండి అందుబాటులో ఉండనుంది. స్లమ్ డాగ్ హస్బెండ్: సంజయ్ రావు, ప్రణవి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్. కుక్కతో పెళ్లి చేసుకున్న హీరో పాత్ర విడాకులు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నదనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. బ్రహ్మాజీ, సునీల్, సప్తగిరి, యాదమ్మ రాజు తదితరులు నటించిన ఈ సినిమాను ఏ ఆర్ శ్రీధర్ తెరకెక్కించారు.