నాయకుడు ఓటీటీ రిలీజ్: రిలీజై రెండు వారాలు పూర్తి కాకముందే స్ట్రీమింగ్ కు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళంలో మామన్నాన్ పేరుతో రిలీజైన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా, ఎంత మంచి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు.
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం, 50కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది.
తెలుగులో నాయకుడు పేరుతో జులై 14న రిలీజైన ఈ సినిమా, ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది.
తెలుగులో విడుదలై రెండు వారాలు కూడా పూర్తి కాకముందే ఓటీటీలో దర్శనమివ్వనుంది. ఈ నెల 27నుండి తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓటీటీలోకి వచ్చేస్తున్న నాయకుడు
VADIVELU, UDHAYANIDHI, FAHADH, KEERTHY, MARI SELVARAJ AND AR RAHMAN TOGETHER!! We’re seeing stars🤩#Maamannan, coming to Netflix on the 27th of July!🍿#MaamannanOnNetflix pic.twitter.com/Fl8ulKvdID
— Netflix India South (@Netflix_INSouth) July 18, 2023