కెవిన్ హీరోగా వస్తున్న స్టార్ మూవీ నుండి స్పెషల్ ప్రోమో విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్, ఇప్పుడు తమిళంలోకి అడుగు పెట్టింది. ఇటీవల ఈ బ్యానర్ నుండి తెలుగులో విరూపాక్ష రిలీజై వందకోట్లు వసూలు చేసింది.
ప్రస్తుతం తమిళ నిర్మాణ సంస్థ రైజ్ ఈస్ట్ ఎంటర్ టైన్మెంట్ తో కలిసి స్టార్ మూవీని నిర్మిస్తోంది.
బిగ్ బాస్ రియాలిటీ షో ఫేమ్ కెవిన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను ఎలాన్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి స్పెషల్ ప్రోమోను వదిలారు.
స్టార్ మూవీకి సంగీతం అందిస్తున్న యువన్ శంకర్ రాజా పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోమోను విడుదల చేసారు. రెండు నిమిషాల ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ ట్వీట్
You are a #STAR ⭐
— SVCC (@SVCCofficial) August 31, 2023
️#STARMOVIE Special Promo is Out ! #HAPPYBIRTHDAYYUVAN Sir🌟🎶
▶️- https://t.co/JawXPUjiAu#KAVIN #YUVAN #ELAN@Kavin_m_0431 @elann_t @thisisysr @riseeastcre @SVCCofficial @Pentelasagar @BvsnP @Ezhil_DOP @PradeepERagav @Meevinn @sujith_karan @dancersatz pic.twitter.com/eXgj0x8uh8