Page Loader
Telugu Movies 2023: ఈ వారం థియేటర్‌- ఓటీటీలో అలరించనున్న పెద్ద సినిమాలివే
ఈ వారం థియేటర్‌ - ఓటీటీలో అలరించనున్న సినిమాలివే

Telugu Movies 2023: ఈ వారం థియేటర్‌- ఓటీటీలో అలరించనున్న పెద్ద సినిమాలివే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు పలు ఆసక్తికర సినిమాలు రానున్నాయి. ఈ మేరకు రెండో వారంలో అలరించేందుకు కొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. వాటిల్లో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు బ్లాక్‌బస్టర్‌ మూవీలు సైతం సిద్ధమయ్యాయి. బాలీవుడ్ హీరో షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'జవాన్‌' కోసం ఇప్పటికే ప్రేక్షకులు, అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. విజయ్‌ సేతుపతి, ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అట్లీ దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ప్రియమణి, సన్యా మల్హోత్రా తదితరులతో రూపుదిద్దుకుంటున్న జవాన్ సినిమా సెప్టెంబరు 7న థియేటర్లో రిలీజ్ కానుంది.

details

అమెజాన్‌ ప్రైమ్‌ లోకి జైలర్ 

మరోవైపు విడుదలై రికార్డులు సృష్టించిన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్‌ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అంతా ఎదురుచస్తున్నారు. ఆగస్ట్ 10న రిలీజై ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోకి సెప్టెంబర్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ట్రాన్స్‌జెండర్‌ పాత్రతో ప్రేక్షకులను పలకరించేందుకు విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సిద్ధమయ్యారు. అక్షత్‌ అజయ్‌ శర్మ దర్శకత్వంలో 'హడ్డీ'గా రూపొందిన సినిమాలో, హరి పాత్రలో సిద్ధిఖీ నటించారు. హరి అమ్మాయిగా మారేందుకు గల కారణం ఏమిటి, తర్వాత పరిస్థితులు ఎలా ఎదురయ్యాయి అనే కోణంలో చిత్రం సాగుతుంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో సెప్టెంబరు 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.