
Game Changer: గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం 'గేమ్ ఛేంజర్' సినిమాకు సంబంధించి టికెట్ ధరల పెంపును అనుమతించింది. జనవరి 10వ తేదీ నుంచి ఉదయం 4 గంటల ప్రత్యేక షోతో ప్రారంభమయ్యేలా 6 షోలకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ టికెట్‌కు అదనంగా ₹150, సింగిల్ స్క్రీన్ టికెట్‌కు అదనంగా ₹100 పెంచేందుకు కూడా అనుమతించింది. జనవరి 11వ తేదీ నుంచి రోజుకు 5 షోలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ తేదీ నుంచి మల్టీప్లెక్స్ టికెట్ ధర ₹100, సింగిల్ స్క్రీన్ టికెట్ ధర ₹50 పెరుగుతుంది. అయితే, బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.
వివరాలు
జనవరి 10న ప్రేక్షకుల ముందుకు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌జే సూర్య ప్రతినాయక పాత్ర పోషించగా, సంగీత దర్శకుడిగా తమన్ పనిచేశారు. ఈ చిత్రంలో ఐదు పాటల కోసం రూ.75 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం జరిపారు. ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ.