Thalapathy Vijay: తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం.. పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన 'లియో' స్టార్
తమిళ సినిమా అగ్ర హీరోగా కొనసాగుతున్న'తలపతి విజయ్' రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో, ఫిబ్రవరిలో, విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రికళగం' (TVK) ఏర్పాటును ప్రకటించారు. గురువారం ఆయన మరో అడుగు ముందుకేసి చెన్నైలోని పయ్యనూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భారీ కార్యక్రమంలో పార్టీ జెండాను, చిహ్నాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ గీతాన్ని కూడా ఆవిష్కరించారు.తమిళనాడు రాజకీయాల్లోకి సినీ తారల ప్రవేశం అందరికీ తెలిసిన విషయమే. ఎం.జి.రామచంద్రన్ నుంచి జయలలిత వరకు,శివాజీ గణేశన్ నుంచి రజనీకాంత్,కమల్ హాసన్,విజయకాంత్ వరకు ఎందరో ప్రముఖ నటులు వెండితెర నుంచి రాజకీయ రంగానికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి దళపతి విజయ్ పేరు కూడా చేరింది.
విజయ్ తన జీవితాన్ని తమిళనాడు ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నాడు
తమిళ చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుల్లో విజయ్ ఒకరు. అయనకు యువత, మహిళల్లో మంచి క్రేజ్ ఉంది. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో, విజయ్, సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పార్టీ త్వరలో మెగా కాన్ఫరెన్స్ నిర్వహిస్తుందని, అక్కడ వారు TVK సూత్రాలు, లక్ష్యాలను వివరిస్తారని చెప్పారు. తాను ఇంతకు ముందు తన కోసమే జీవించానని, ఇప్పుడు తన జీవితాన్ని తమిళనాడు ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నానని ఉద్ఘాటించారు.
జెండా ఎలా ఉంది
అయితే విజయ్‌కి ముందున్నసవాళ్లే కీలకం.నిజానికి, రాజకీయ రంగంలో, విజయ్ పార్టీ TVK బాగా స్థిరపడిన ద్రవిడ పార్టీలు - ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) తో పోటీపడుతుంది. ఈ రెండు పార్టీలు దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) కూడా రాష్ట్రంలో తన ఉనికిని నిరంతరం పెంచుకుంటోంది. ఎరుపు, పసుపు రంగుల్లో జెండా ఉంది. జెండా మధ్యలో సూర్యకిరణాలు, పక్కనే రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు అభిమానులు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.