LOADING...
Pawan Kalyan: తమన్ క్రియేటివిటీ మాములుగా లేదుగా.. ఓజీ బీజీఎం‌లో జపాన్ వాయిద్యాల మాయాజాలం
తమన్ క్రియేటివిటీ మాములుగా లేదుగా.. ఓజీ బీజీఎం‌లో జపాన్ వాయిద్యాల మాయాజాలం

Pawan Kalyan: తమన్ క్రియేటివిటీ మాములుగా లేదుగా.. ఓజీ బీజీఎం‌లో జపాన్ వాయిద్యాల మాయాజాలం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2025
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'ఓజీ'(OG) నుంచి అభిమానులకు మేకింగ్‌లో ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ అందింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్, తాజాగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) కి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది మరియు లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోలో తమన్ స్వయంగా స్టూడియోలో వాయిద్య పరికరాలను వాయిస్తూ కనిపిస్తుండగా, ఆయన ఎక్స్‌ప్రెషన్స్, డెడికేషన్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కథానాయకుడి యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ BGMలో, ముఖ్యంగా జపాన్‌కు చెందిన అరుదైన వాయిద్య పరికరాలు వినియోగించినట్లు తెలుస్తోంది.

Details

ఆనందంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

వీటివల్ల సినిమా యాక్షన్ సీన్స్‌కు కొత్త ఉత్సాహం, ఇంటెన్సిటీ వస్తుందని విశేషంగా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఈ BGM క్లిప్ వైరల్ అవుతూ, పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ఉత్సాహాన్ని కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు. 'తమన్ మళ్లీ మ్యాజిక్ చేస్తున్నారు 0G బీజీఎం వింటుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి వంటి ప్రశంసల వర్షం కురుస్తోంది. గతంలో 'వీరసింహారెడ్డి', 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్‌బస్టర్లకు సంగీతం అందించిన తమన్, ఇప్పుడు 'ఓజీ'తో మరో సెన్సేషనల్ సక్సెస్‌ ఖాతాలో పెట్టబోతున్నారని అభిమానులు నమ్ముతున్నారు.

Details

'ఓజీ'పై భారీ అంచనాలు

వీటివల్ల 'ఓజీ'పై అంచనాలు మరింత పెరిగినట్టే అని చెప్పాలి. ఇంకా ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు నెట్టింట హల్‌చల్ చేస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సమురాయ్ రోల్‌లో కనిపిస్తారన్న వార్తలొచ్చాయి. మాఫియా, గన్, పవర్ ఫుల్ వెపన్స్, గ్యాంగ్‌స్టర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా 'ఓజీ'ను డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులని మనసు దోచేసాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా కొన్ని గన్స్ కూడా డిజైన్ చేయించారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు, హరిహర వీరమల్లుతో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నారని ఇండస్ట్రీలో అంచనా వేస్తున్నారు.