Page Loader
Thangaalan First Gilmpse Relaese: చియాన్ విక్రమ్...తంగాలన్ గ్లింప్స్..రైజింగ్ గూజ్ బంప్స్

Thangaalan First Gilmpse Relaese: చియాన్ విక్రమ్...తంగాలన్ గ్లింప్స్..రైజింగ్ గూజ్ బంప్స్

వ్రాసిన వారు Stalin
Apr 17, 2024
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు పా రంజిత్(Paa Ranjit)హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) తో కలసి రూపొందించిన పీరియాడికల్ ఫిల్మ్ తంగలాన్(Thangaalan) ఫస్ట్ గ్లింప్స్ ను టైం చూసుకుని మరీ వదిలారు. చూస్తుంటేనే గూజ్ బంప్స్ తెప్పించేస్తున్నాడు విక్రమ్. స్టూడియో గ్రీన్, జియో స్టూడియో బేనర్స్ పై నిర్మాత కె.జ్ఞానవేల్ రాజా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బుధవారం చియాన్ విక్రమ్ బర్త్ డే పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే గిఫ్ట్ ను ఇస్తూ చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ సినిమా కోసం విక్రమ్ ఎంత కష్ట పడ్డాడో పోస్టరే చెప్పేస్తోంది. తన ఫెర్మార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడో వీడియోలో తెలిసిపోతోంది.

Thangaalan-First glimpse

కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో సినిమా

ఈ సినిమాలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ కథాయనాయికలుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. జియో స్టూడియో రాకతో ఈ సినిమా గ్లోబల్ రీచ్ కు చేరుకుంటుందని ఆశిస్తున్నామని దర్శకుడు పా రంజిత్ తెలిపారు. చరిత్రలో జరిగిన కొన్ని యథార్థ ఘటనలతో తెరకెక్కిస్తున్నామని చెప్పాడు.