Page Loader
Allu Arjun: 'అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు'.. అల్లు అర్జున్
'అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు'.. అల్లు అర్జున్

Allu Arjun: 'అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు'.. అల్లు అర్జున్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2024
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందిన సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన అనంతరం, జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తన అభిమానుల ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలని చెప్పారు. ఈ సందర్భంగా, సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ బాధిత కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ని. ఎప్పుడూ చట్టానికి కట్టుబడి ఉంటానన్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేనని, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Details

ఎవరూ ఆందోళన చెందొద్దు

ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు. 20 ఏళ్లుగా తాను థియేటర్‌లో సినిమాలు చూస్తున్నానని, తన సినిమాలే కాకుండా, మావయ్య చిరంజీవి సినిమాలు కూడా ఈ థియేటర్‌లో చూసేవాడిని అని చెప్పారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, అయితే తన మీద ప్రేమ, అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేశారు. తాను బాగున్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.