LOADING...
Pawan Kalyan: దటీజ్ పవన్ కళ్యాణ్.. ఇంకా రిలీజ్ కాకుండానే 100 కోట్ల క్లబ్‌లో ఓజీ?
దటీజ్ పవన్ కళ్యాణ్.. ఇంకా రిలీజ్ కాకుండానే 100 కోట్ల క్లబ్‌లో ఓజీ?

Pawan Kalyan: దటీజ్ పవన్ కళ్యాణ్.. ఇంకా రిలీజ్ కాకుండానే 100 కోట్ల క్లబ్‌లో ఓజీ?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2025
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ OG పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ఇప్పటికే విడుదలైన రెండు గ్లింప్స్‌కి పవన్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేమికుల నుండి అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించనప్పటికీ, ప్రేక్షకుల్లో ఉత్కంఠ మాత్రం తారాస్థాయిలో ఉంది. ఇటీవల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ మరో 20 రోజులు డేట్స్ కేటాయిస్తే OG షూటింగ్ పూర్తవుతుందని చిత్రబృందం చెబుతోంది. కానీ పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్‌కు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు.

Details

దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశం

OG సినిమాపై ఉన్న హైప్ మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ ఏ సభకు వెళ్లినా OG అనే నినాదాలు మారుమోగుతున్నాయి. మార్కెట్లో OGకి భారీ డిమాండ్ ఉండటంతో థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ కొనసాగుతుండగానే, ఓటీటీ రైట్స్ కోసం కూడా భారీగా పోటీ నెలకొంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్, OG డిజిటల్ హక్కులను 100 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇది OG సినిమా మార్కెట్ వాల్యూ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చెబుతోంది. పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే వచ్చే దసరా సందర్భంగా గ్రాండ్‌గా OG విడుదలయ్యే అవకాశం ఉంది.

Details

ముంబై మాఫీయా నేపథ్యంలో కథ

ఈ సినిమా దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినీ వర్గాల అంచనా ప్రకారం, ఈ సినిమా రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ఈజీగా సాధించగలదు. OG కథ ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఇందులో ఓ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా దర్శనమివ్వనున్నారు. దీంతో ఈ చిత్రం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందన్న అంచనాలు నెలకొన్నాయి.