LOADING...
Krish : ఆ కారణం వల్లే హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్నా : క్రిష్ 
ఆ కారణం వల్లే హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్నా : క్రిష్

Krish : ఆ కారణం వల్లే హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్నా : క్రిష్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, సినిమా ఆలస్యం కావడంతో, క్రిష్ కొన్ని షెడ్యూలింగ్ సమస్యల కారణంగా, తర్వాతి షూటింగ్‌లో పాల్గొనలేకపోయాడు. అందుచేత, నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా పూర్తి చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో, క్రిష్ అనుష్క ప్రధాన పాత్రలో 'ఘాటీ' అనే కొత్త సినిమా చేస్తున్నాడు, ఇది సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంలో, క్రిష్ తన టీమ్‌తో మీడియా ముందుకు వచ్చి, హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడారు.

Details

షెడ్యూలింగ్ సమస్యల కారణంగానే పక్కకు రావాల్సి వచ్చింది

ప్రతి సినిమా ఒక జర్నీ. హరిహర వీరమల్లు సినిమాలో నేను కొంత భాగం మాత్రమే చిత్రీకరించాను. పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రేమించాను, ఇష్టపడాను. రత్నంపై అమితమైన గౌరవం ఉంది. చిన్నప్పుడే ఆయన 'సూర్య' మూవీ పోస్టర్‌ను చూసి, ఎప్పుడైనా ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. సినిమా మొదలు పెట్టాక, కోవిడ్ పరిస్థితులు, షెడ్యూలింగ్ సమస్యల కారణంగా, కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. పర్సనల్ ఇష్యూస్ కారణంగా నేను తప్పుకోవాల్సి వచ్చింది. నా తర్వాత, జ్యోతి కృష్ణ సినిమా పూర్తిచేశారు. కానీ, నేను ఆ సినిమా నుంచి వచ్చాక, పూర్తిగా ఘాటీ (Ghati) సినిమాలో ఫోకస్ చేసి పని చేస్తున్నానని వెల్లడించారు.