
Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప'పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది.
ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా విశేషాలు పంచుకున్న విష్ణు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకి ఇంటర్వ్యూలో తన అనుభవాలను వివరించారు
Details
'కన్నప్ప' ప్రారంభం ఎలా జరిగింది?
2014లో తనికెళ్ల భరణి 'కన్నప్ప' ఐడియాను చెప్పారు. ఆ ఐడియా నాకు బాగా నచ్చింది. విదేశాల నుంచి నిపుణులను పిలిపించి కథను అభివృద్ధి చేయించాను.
కొన్ని నెలలకే భరణి నా అభిరుచిని గమనించి, దీనిని భారీ స్థాయిలో తెరకెక్కించమన్నారు.
ఆ కథను తీసుకొని నా స్వంత వెర్షన్ సిద్ధం చేసుకున్నా. మొదట్లో రూ.100 కోట్ల బడ్జెట్‌లో సినిమా పూర్తవుతుందనుకున్నా, కానీ ఖర్చు రెట్టింపు అయిందని విష్ణు చెప్పారు.
Details
ప్రభాస్ సహకారం మరువలేనిది
'మహాభారతం టీవీ సిరీస్‌ని తెరకెక్కించిన ముకేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని నాన్న సూచించారు.
ఆయన మాట, శివుడి ఆశీర్వాదంతోనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాను. ఈ ప్రయాణంలో ప్రభాస్ నాకు అపారంగా సపోర్ట్ చేశారు.
ఆయన పాత్ర అయిన 'రుద్ర' ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
నాన్న, ప్రభాస్ మధ్య సన్నివేశం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుందని అన్నారు.
Details
వీఎఫ్‌ఎక్స్ కారణంగా ఆలస్యం
వీఎఫ్‌ఎక్స్ పనుల విషయంలో కొంత అవగాహన లేని వ్యక్తిని తీసుకోవడం వల్ల సినిమా ఆలస్యమైందని విష్ణు తెలిపారు.
'ఇది నా జీవితంలోనే చేసిన అతిపెద్ద తప్పు. కానీ ఇప్పుడు మా టీమ్ అంతా పాటుపడి సినిమా సమయానికి విడుదలయ్యేలా శ్రమిస్తోందని వివరించారు.
Details
కుటుంబ సమస్యలపై స్పందన
ఈ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మోహన్‌బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాల గురించి కూడా మాట్లాడారు. 'వివాదాలు చూస్తుంటే బాధగా ఉంటుంది.
'కన్నప్ప' విడుదలయ్యాక మీ కుటుంబసభ్యులంతా కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి. అవసరమైతే నేను పెద్దరికం తీసుకుంటానని అన్నారు.
విష్ణు స్పందిస్తూ మీ మాటలు గౌరవిస్తా. గొడవలు జరిగిన కొన్నిరోజుల్లో మీరు ఫోన్ చేసి ఏం జరుగుతుంది అని అడిగారు. ఆ క్షణాన్ని మర్చిపోలేను.
ఇండస్ట్రీ ఒక కుటుంబం లాంటిది. మీ సూచనలను ఫాలో అవుతానని అన్నారు.