Sushmita Sen: సుస్మితా సేన్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారం.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
డబ్బు కోసం ఆశపడే వ్యక్తి అంటూ మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుష్మిత సేన్‌పై వచ్చిన ఆరోపణలను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ యాదవ్ ఖండించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, సుస్మితా సేన్ వ్యక్తిత్వం గురించి ప్రశంసలు కురిపిస్తూ ఆమెపై వచ్చిన విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా లలిత్ మోదీ మాట్లాడుతూ.. "సుస్మిత ఎంతో కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది వ్యక్తుల కంటే ఆమె వద్దే ఎక్కువ విలువైన వజ్రాలు ఉన్నాయి. ముఖ్యంగా అవన్నీ ఆమె స్వయంగా సంపాదించుకున్నవి. అంతేకాదు, ఆమెకు సొంతంగా డైమండ్ స్టోర్లు కూడా ఉన్నాయని తెలిపారు.
వివరాలు
అమె ఆశించే వ్యక్తి కాదు
తమ బంధం కొనసాగిన సమయంలో జరిగిన అనుభవాలను కూడా ఆయన పంచుకున్నారు. "మేమిద్దరం కలిసి బయటకు వెళ్లినప్పుడు ఖర్చులు చెల్లించాల్సిన పరిస్థితి నాకు చాలా అరుదుగా వచ్చేది. దాదాపు అన్ని సందర్భాల్లో సుస్మితే బిల్లులు చెల్లించేది. నిజం చెప్పాలంటే నేనే ఆమె డబ్బులపై ఆధారపడేవాడిని. ఆమె ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి ఏదైనా ఆశించే వ్యక్తి కాదు. ఆమె గురించి పూర్తిగా తెలియని వాళ్లు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తారని అన్నారు. సుస్మితాతో తనకున్న అనుబంధం గురించి కూడా లలిత్ మోదీ భావోద్వేగంగా మాట్లాడారు.
వివరాలు
మా మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనది
"సుస్మిత నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నేను ఈరోజు ఉన్న స్థాయికి చేరుకోవడంలో, వ్యక్తిగతంగా ఎదగడంలో ఆమె ఎంతో సహకరించింది. మా మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనది అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, పన్ను ఎగవేత మరియు మనీలాండరింగ్ కేసుల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన లలిత్ మోదీ 2010 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు. 2022లో తాను సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించి వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి వీరిద్దరి సంబంధం తరచూ చర్చనీయాంశంగా మారుతూ వస్తోంది.