Page Loader
Mahesh Babu: విరామం ముగిసింది.. SSMB29 సెట్‌పైకి మహేష్ బాబు రీఎంట్రీ!
విరామం ముగిసింది.. SSMB29 సెట్‌పైకి మహేష్ బాబు రీఎంట్రీ!

Mahesh Babu: విరామం ముగిసింది.. SSMB29 సెట్‌పైకి మహేష్ బాబు రీఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 15, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ SSMB29. మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో కొనసాగుతోంది. తాజాగా ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత యూనిట్ స్వల్ప విరామం తీసుకుంది. ఈ బ్రేక్ టైమ్‌లో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఇటలీకి వెళ్లాడు. రోమ్ నగరంలో హాలిడే ఎంజాయ్ చేసిన ఆయన, ఈరోజు ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, డైరెక్టర్ రాజమౌళి కూడా కుటుంబ సమేతంగా జపాన్ టూర్‌కి వెళ్లారు.

Details

త్వరలో మరిన్ని అప్డేట్లు

అక్కడ ఆయన 'RRR: Behind & Beyond' డాక్యుమెంటరీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన కూడా త్వరలో తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఆయన రాగానే SSMB29 తదుపరి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇటీవలే ఒడిశాలోని సిమిలిగుడ దగ్గర షూటింగ్ జరిగింది. మాలి, పుట్‌సీల్‌, బాల్డ వంటి లొకేషన్లలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా పాల్గొన్నారు. గ్లోబల్ లెవెల్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ఫ్యాన్స్‌ లో విపరీతమైన హైప్ నెలకొంది. ప్రతీ అప్డేట్‌ పట్ల ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలో మరిన్ని ఎగ్జయిటింగ్ న్యూస్ వచ్చే అవకాశముందని టాక్ నడుస్తోంది!

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో  వైరల్ అయిన వీడియో