LOADING...
Mirai Collections : దూసుకెళ్తున్న 'మిరాయి'.. మూడ్రోజుల్లో ఎంత కలెక్షన్స్ సాధించిందంటే?
దూసుకెళ్తున్న 'మిరాయి'.. మూడ్రోజుల్లో ఎంత కలెక్షన్స్ సాధించిందంటే?

Mirai Collections : దూసుకెళ్తున్న 'మిరాయి'.. మూడ్రోజుల్లో ఎంత కలెక్షన్స్ సాధించిందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2025
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తేజ సజ్జా, రితిక నాయక్ హీరోహీరోయిన్లుగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన 'మిరాయ్' సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. డివోషనల్ సస్పెన్స్-ఫాంటసీ కథాంశంతో రూపొందిన 'మిరాయ్' ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మొదటి రోజే 'మిరాయ్' 27 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి భారీ ఓపెనింగ్ ఇచ్చింది. మూడ్రోజుల్లో సినిమా 81.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది.

Details

త్వరగా రూ.100 కోట్లు దాటే అవకాశం

రూ. 60 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 44 కోట్ల మేర ఉంది. హిట్ కావడానికి 90 కోట్ల గ్రాస్ అవసరం. కాబట్టి, ఇంకా 9 కోట్లు వసూల్ అయితే 'మిరాయ్' బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుతం ఇది త్వరగా 100 కోట్లు దాటే అవకాశం ఉంది. నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా కూడా 'మిరాయ్' 45 కోట్లు రాబట్టింది. దీంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు మొత్తం ఓవరాల్ ప్రాఫిట్ వస్తోంది. అమెరికాలో కూడా సినిమా 2 మిలియన్ డాలర్లకు దగ్గరగా వసూలు చేసింది. తేజ సజ్జా 'హనుమాన్' తరువాత మరోసారి భారీ హిట్ సాధించారు.