Page Loader
Kannappa: 'కన్నప్ప' నుండి ఫస్ట్ సాంగ్.. శివ శివ శంకర వచ్చేసింది 

Kannappa: 'కన్నప్ప' నుండి ఫస్ట్ సాంగ్.. శివ శివ శంకర వచ్చేసింది 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కన్నప్ప'. టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధమైన పాన్-ఇండియా చిత్రాలలో ఇదికూడా ఒకటి. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, అధికారిక టీజర్ విడుదలైన తర్వాత, హైప్ పెరగాల్సిన సమయంలో, సినిమా తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. ఇప్పటివరకు ఈ చిత్రంపై వచ్చిన స్పందనలో పాజిటివ్ కామెంట్ల కంటే ట్రోల్సే ఎక్కువగా కనిపించాయి.

వివరాలు 

ట్రోల్స్‌కి ఈ పాటతో మంచు విష్ణు సమాధానం

ఇటీవల ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసినప్పుడు, మంచు ఫ్యామిలీపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో, తాజాగా 'కన్నప్ప' నుండి 'శివ శివ శంకర' అనే పూర్తి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్ విజయ్ ప్రకాశ్ ఆలపించారు. ఇప్పటివరకు సినిమాపై వచ్చిన ట్రోల్స్‌కి ఈ ఒక్క పాటతో మంచు విష్ణు సమాధానం ఇచ్చినట్లు అనిపిస్తోంది. 'శివ శివ శంకర' పాట వినగానే సినిమా మీద ఉన్న నెగటివిటీ తగ్గి,ప్రేక్షకుల్లో పాజిటివ్ వైవ్స్ పెరిగాయని చెప్పవచ్చు. ఇకపై విడుదలయ్యే ఇతర కంటెంట్ కూడా ఇదే స్థాయిలో ఆకట్టుకుంటే,'కన్నప్ప' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించే అవకాశాలు ప్రబలంగా కనిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్