Page Loader
The Girlfriend: రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా 'గర్ల్ ఫ్రెండ్' ప్రత్యేక పోస్టర్‌ల విడుదల 
రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా 'గర్ల్ ఫ్రెండ్' ప్రత్యేక పోస్టర్‌ల విడుదల

The Girlfriend: రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా 'గర్ల్ ఫ్రెండ్' ప్రత్యేక పోస్టర్‌ల విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 05, 2024
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్మిక మందన్నఈరోజు తన 28వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా,ఆమె రాబోయే పాన్-ఇండియా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' నిర్మాతలు తాజాగా రెండు పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో రష్మిక మందాన ఎంతో క్యూట్ గా కనపడుతోంది.ఈ చిత్రం కన్నడ,తెలుగు,తమిళం, మలయాళం,హిందీ భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ లో 'యానిమల్' సినిమాలో నటించిన రష్మిక మందన్న ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా పుష్పసినిమాతో నటనపరంగా మంచి పేరు తెచ్చుకున్న..రష్మిక ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాలో నట విశ్వరూపాన్ని చూపించి అందరి మన్నలను పొందింది. ప్రస్తుతం పుష్ప టు ది రూల్,ది గర్ల్ ఫ్రెండ్,కుబేర సినిమాలతో రష్మిక మందాన బిజీగా ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్మిక ఎంత క్యూట్ గా ఉందొ..