Page Loader
Sanjay Gadhvi: గుండెపోటుతో 'ధూమ్' దర్శకుడు సంజయ్ గాధ్వి కన్నుమూత 
Sanjay Gadhvi: గుండెపోటుతో 'ధూమ్' దర్శకుడు సంజయ్ గాధ్వి కన్నుమూత

Sanjay Gadhvi: గుండెపోటుతో 'ధూమ్' దర్శకుడు సంజయ్ గాధ్వి కన్నుమూత 

వ్రాసిన వారు Stalin
Nov 19, 2023
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ధూమ్' 'ధూమ్ 2' చిత్రాల దర్శకుడు సంజయ్ గాధ్వి ఆదివారం కన్నుమూసాశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంజయ్ గాధ్వి మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంజయ్ గధ్వి 2000లో 'తేరే లియే' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమాతో ఆయనకు అంతకా గుర్తింపు రాలేదు. 2004లో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ధూమ్‌'తో సంజయ్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. 'మేరే యార్ కి షాదీ హై', ఇమ్రాన్ ఖాన్ నటించిన 'కిడ్నాప్', 'అజబ్ గజబ్ లవ్', 'ఆపరేషన్ పరిందే'తో సంజయ్ గుర్తింపు పొందారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బాలీవుడ్‌లో విషాదం