LOADING...
Tollywood: 'డాడీ' సినిమాలో చిరు కూతురు.. జిమ్ ఫోటోలతో లుక్స్ అదుర్స్
'డాడీ' సినిమాలో చిరు కూతురు.. జిమ్ ఫోటోలతో లుక్స్ అదుర్స్

Tollywood: 'డాడీ' సినిమాలో చిరు కూతురు.. జిమ్ ఫోటోలతో లుక్స్ అదుర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో విజయవంతమైన సినిమాల సంఖ్యకు లెక్కపెట్టడం కష్టం. ఆయన సినిమాల్లో పరాజయాలు అంటే చాలా అరుదు. ఒకప్పుడు చిరు చిత్రాలు 200, 300 రోజులు నడుస్తూ రికార్డులు సృష్టించేవి. ఇప్పుడు బాక్సాఫీస్‌ కలెక్షన్లే ప్రధాన చర్చగా మారాయి. అయితే, చిరంజీవి చేసిన అత్యంత హృదయాన్ని తాకే సినిమాల్లో 'డాడీ' ప్రత్యేకంగా నిలిచింది. ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో 2001లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్ నిర్మించారు. సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ కథ మొదట వినగానే చిరంజీవి.. వెంకటేష్ చేస్తే బాగుంటుందని అన్నారని చెబుతారు. కానీ రచయిత భూపతిరాజా మాత్రం ఈ కథ మెగాస్టార్‌కే బాగా సరిపోతుందని పట్టుబట్టారు.

Details

సినీ రంగానికి దూరంగా నటి

చివరికి రచయిత నమ్మకం నిజమైంది. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి కూతురి పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా? తన ముద్దు నటనతో అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. చిరు-కూతురు సన్నివేశాలు ఇంకా అభిమానుల కళ్లముందే తిరుగుతున్నాయి. ఆ చిన్నారి ఇప్పుడు పెద్దయ్యాక గ్లామరస్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె పేరు అనుష్క మల్హోత్రా. ముంబైకు చెందిన అనుష్క, పరిచయస్తుల ద్వారా మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం పొందింది. ప్రస్తుతం ఆమె సినీ రంగానికి దూరంగా ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్‌గా ఉండదు. తాజాగా ఆమె షేర్ చేసిన జిమ్ ఫొటోలు కుర్రకారను ఫిదా అయ్యేలా చేశాయి.