Saindhav: "సైంధవ్" ఓటీటీ ఎంట్రీ.. రిలీజ్ డేట్ ఫిక్స్.!
ఈ వార్తాకథనం ఏంటి
శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సైంధవ్.
ఈ సినిమా సాలిడ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా గా రిలీజ్ అయ్యింది కానీ ఈ చిత్రం థియేటర్స్ లో అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేదు.
అయితే ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నట్టుగా బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.
జనవరి 13, 2024న థియేట్రికల్‌గా విడుదలైన ఈ సినిమా దాదాపు ఒక నెల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధంగా ఉందని ఊహాగానాలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి.
Details
ఓటిటి విడుదలపై ఇంకా రాని క్లారిటీ
ఈ సినిమా ఫిబ్రవరి 2, 2024న ప్రీమియర్ అవుతుందని టాక్. అయితే, ఈ విషయమై ప్రొడక్షన్ టీమ్ లేదా OTT ప్లాట్‌ఫారమ్ అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆండ్రియా జెరేమియా, ముఖేష్ రిషి, బేబీ సారా, రుహాని శర్మ తదితరులు నటించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.