Ramayana Box Office Collection: విదేశాల్లోనూ 'రామాయణం' ప్రభంజనం.. ఆ దేశాల్లో ఇండియన్ సినిమాల రికార్డులు బద్దలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ ఇతిహాసం రామాయణం మన దేశానికే పరిమితం కాలేదు. ఆసియాలోని దాదాపు 300కు పైగా ప్రాంతీయ రూపాల్లో ఈ కథ ప్రాచుర్యంలో ఉంది. ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో రామాయణం అక్కడి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైంది. ఇప్పుడు ఈ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన 'రామాయణ' సినిమా కూడా ఆయా దేశాల్లో భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇండోనేషియా, థాయ్‌లాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, నేపాల్‌లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది.
వివరాలు
ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లో భారీ వసూల్లు
ఇండోనేషియాలో రామాయణం 'కకావిన్ రామాయణ', 'బాలినీస్ రామకవచ' తదితర పేర్లతో శతాబ్దాలుగా అక్కడి సంస్కృతిలో భాగంగా ఉంది.
ఈ నేపథ్యంలో 'రామాయణం' సినిమా ప్రీమియర్ల ద్వారానే లక్ష డాలర్లు (సుమారు రూ.1 కోటి) వసూలు చేసింది. తద్వారా ఇండోనేషియాలో ఓ భారతీయ సినిమాకు లభించిన అత్యుత్తమ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఇక థాయ్‌లాండ్‌లో రామాయణం 'రామకీన్' పేరుతో ప్రసిద్ధి చెందింది. అక్కడ ఈ చిత్రం విడుదలైన వారంలోనే 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.9 కోట్లు) వసూలు చేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఉన్న కంబోడియాలో రామాయణాన్ని 'రీమ్‌కర్' పేరుతో పాఠశాలల సిలబస్‌లో బోధిస్తారు.
వివరాలు
వియత్నాంలోనూ రికార్డు వసూల్లు
ఈ దేశంలో సినిమా తొలి వీకెండ్‌లోనే 1.5 లక్షల డాలర్లు వసూలు చేసింది. పొరుగున ఉన్న మలేషియాలోనూ విడుదలైన వారం రోజుల్లోపే 9 లక్షల డాలర్లు (సుమారు రూ.8 కోట్లు) రాబట్టి ఆకట్టుకుంది.
సాధారణంగా వియత్నాంలో భారతీయ సినిమాలకు పెద్దగా మార్కెట్ లేదు. అక్కడ మన సినిమాలు 20 వేల డాలర్లు వసూలు చేయడమే కష్టంగా ఉంటుంది.
అయితే 'రామాయణం' సినిమా మాత్రం ఈ రికార్డును తొలి రోజే అధిగమించింది. ఇప్పటివరకు అక్కడ ఏకంగా 3.5 లక్షల డాలర్లు వసూలు చేసింది.
వియత్నాంను సుమారు 1,500 ఏళ్ల పాటు పాలించిన చంపా రాజవంశం హిందూ సంస్కృతిని ఆదరించింది. అక్కడ 1,300 ఏళ్ల నాటి వాల్మీకి మహర్షి ఆలయం ఉండటం విశేషం.
వివరాలు
నేపాల్‌లో 'బాహుబలి 2' రికార్డుపై కన్ను
అంతేకాదు, అక్కడి పాఠశాలలు, కళాశాలల్లో రామాయణాన్ని ప్రపంచ సాహిత్య పాఠ్యాంశంగా బోధిస్తారు. ఈ కారణాలతోనే 'రామాయణం' సినిమాకు అక్కడ విశేష ఆదరణ లభిస్తోంది.
నేపాల్‌లో భారతీయ సినిమాలకు ఎప్పటినుంచో మంచి ఆదరణ ఉంది. అయితే 'రామాయణం' సినిమా అక్కడ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎక్స్‌టెండెడ్ ఓపెనింగ్ వీక్‌లోనే 12.80 కోట్ల నేపాల్ రూపాయలు (సుమారు రూ.8 కోట్లు) వసూలు చేసింది.
ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన 'ఆర్ఆర్ఆర్', 'పఠాన్', 'జవాన్' సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లను నేపాల్‌లో అధిగమించింది.
త్వరలోనే 'బాహుబలి 2' పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును కూడా బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.