Page Loader
Hari Hara Veera Mallu: ఎట్టకేలకు 'హరిహర వీరమల్లు' రిలీజ్‌ డేట్‌ ఖరారు… ఎప్పుడంటే?
ఎట్టకేలకు 'హరిహర వీరమల్లు' రిలీజ్‌ డేట్‌ ఖరారు… ఎప్పుడంటే?

Hari Hara Veera Mallu: ఎట్టకేలకు 'హరిహర వీరమల్లు' రిలీజ్‌ డేట్‌ ఖరారు… ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) పార్ట్‌-1 సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. జులై 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే నిర్ణయాన్ని చిత్రబృందం శనివారం ఉదయం ప్రకటించింది. ఈ సినిమా విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ నెల 12న బాక్సాఫీస్‌ ముందు రానున్నా, మరోసారి పోస్ట్‌పోన్‌ అయింది. పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలపై బిజీగా ఉండటంతో పాటు ఇతర కారణాల వల్ల మూవీ షూటింగ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. తొలుత దర్శకుడు క్రిష్‌ కొంత భాగం తెరకెక్కించగా, నిర్మాత ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు.

Details

నాలుగు గంటల్లో డబ్బింగ్ పూర్తి

పవన్‌ కళ్యాణ్ ఇందులో చారిత్రక యోధుడిగా, మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో అలరించనున్నారు. బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ, పవన్‌ రాత్రి 10 గంటలకు డబ్బింగ్‌ మొదలుపెట్టి నాలుగు గంటల్లో పూర్తి చేయడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. సినిమా సెట్స్‌పైనే కొన్ని రోజుల పాటు ఉండటం వల్ల నిర్మాతపై ఆర్థిక భారం పెరిగిందని భావించిన పవన్‌ కళ్యాణ్, తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేయడం మరింత అభినందనీయంగా నిలిచింది.

Details

హీరోయిన్ గా నిధి అగర్వాల్

'అసుర హననం' పాటలోని ఫైట్‌ సన్నివేశాలన్నింటిని పవన్‌ కళ్యాణ్ డిజైన్‌ చేశారని దర్శకుడు జ్యోతికృష్ణ వెల్లడించారు. అంతేకాక, ఈ సినిమా కోసం పవన్‌ ప్రత్యేకంగా మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ చేశారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా శైలిలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ దేవోల్‌, అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం తొలి భాగం 'హరి హర వీరమల్లు: పార్ట్‌-1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.