Vijay Devarakonda: బోటు నడుపుతున్న రౌడీ హీరో.. మురిసిపోతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో 'వీడీ12' ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. షూటింగ్ సమయంలో విరామం తీసుకున్న విజయ్ దేవరకొండ బోట్ రైడ్ చేస్తూ సముద్రంలో సాహసాలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ బోట్‌ను నడుపుతూ నీటిలో దూసుకెళ్తున్న దృశ్యాలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
గూఢచారి పాత్రలో విజయ్
'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణీ వసంత ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు.