Game Changer: ఇంకా పూర్తి కానీ 'గేమ్ ఛేంజర్' షూటింగ్.. నిరాశలో చరణ్ ఫ్యాన్స్
గేమ్ ఛేంజర్ మూవీ ఇంకా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ లో రిలీజ్ పక్కా అంటూ దిల్ రాజు నిర్మాత కామెంట్ చేశాడు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ 'భారతీయుడు 3' పనుల్లో బిజీగా ఉన్నాడు. గతంలో భారతీయుడు 2 పనుల్లో బిజీగా శంకర్ ఉండటంతో రామ్ చరణ్ మూవీ అలస్యం అవుతోంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని డైరక్టర్ శంకర్ భావించడంతో మరోసారి 'గేమ్ ఛేంజర్' సెట్స్ రాం చరణ్ అడుగుపెట్టాడు. ప్రస్తుతం 'భారతీయుడు 3' పోస్ట్ ప్రొడక్షణ్ పనుల్లో శంకర్ బీజీగా ఉన్నాడు.
గేమ్ ఛేంజర్ సినిమాపై నమ్మకంగా దిల్ రాజు
దీంతో తాజాగా జరిగే 'గేమ్ ఛేంజర్' చిత్రీకరణకు ఎస్.జె. సూర్య డైరక్ట్ చేస్తున్నట్లు సమాచారం. డైరక్టర్ ఎస్.జే సూర్య ప్రస్తుతం తెలుగు, తమిళ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దర్శకుడిగా నాని, ఖుషి, పులి వంటి సినిమాలకు ఎస్.జే సూర్య దర్శకత్వం వహించగా, భారతీయుడు 2 సినిమాలో ఎస్.జె సూర్య విలన్ గా నటించాడు. ఒక్క సినిమాకి ఇంత మంది డైరెక్షన్ చేయడంతో 'గేమ్ ఛేంజర్' సినిమాపై అనుమానాలు రేగుతున్నాయి. అయితే దీనిపై దిల్ రాజు మాత్రం ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు.