LOADING...
Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చే ఆరుగురు కామన్‌మెన్స్.. వారు ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చే ఆరుగురు కామన్‌మెన్స్.. వారు ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చే ఆరుగురు కామన్‌మెన్స్.. వారు ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) ప్రారంభానికి రెడీ అయింది. ఈ సీజన్ సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. హోస్ట్‌గా మళ్లీ నాగార్జునే వ్యవహరించనున్నారు. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కంటెస్టెంట్స్‌గా ప్రవేశించబోతున్నారు. అగ్నిపరీక్ష అనే ప్రత్యేక షో ద్వారా కామన్‌మెన్‌ను ఎంపిక చేస్తోన్న సంగతి తెలిసిందే. మొదటగా 45 మందిలో 15 మందిని ఎంపిక చేసి, వారికి పలు టాస్క్‌లు నిర్వహించారు. ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.

Details

ఇప్పటికే ఆరుగురిని ఎంపిక చేసినట్లు సమాచారం

ప్రస్తుతం 13 మంది పోటీలో కొనసాగుతున్నారు. అగ్నిపరీక్ష షో ప్రారంభంలో ఐదుగురిని తొమ్మిదో సీజన్ హౌస్‌లోకి పంపుతామని చెప్పినప్పటికీ, తాజాగా ఆరుగురిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, ఆర్మీ పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, హీమ్యాన్ పవన్ ఉన్నారని వార్తలొస్తున్నాయి. అదేసమయంలో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టనున్న సెలబ్రిటీల జాబితా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రీతూ చౌదరి, ఇమ్మానియేల్, రాము రాథోడ్, తనూజా గౌడ, ఆశా షైనీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, సంజనా గార్లా పేర్లు ఉన్నాయి. వారిలో ఎవరు నిజంగా తొమ్మిదో సీజన్‌లో అడుగుపెట్టబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం వరకు ఆగక తప్పదు.