Urmila Matondkar: 8 ఏళ్ల వివాహా బంధానికి వీడ్కోలు పలకనున్న టాప్ హీరోయిన్.. కారణమిదే!
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.
సెలబ్రిటీలు ఎంతో సీక్రెట్‌గా పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు విడాకులు కూడా అంతే గోప్యంగా తీసుకుంటున్నారు.
ఇటీవల తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఉర్మిళా మటోండ్కర్ తన 8 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు చిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం అనేది ఒక ట్రెండ్‌గా మారింది.
ఉర్మిళా తన భర్త మోసిన్ అక్తర్ మీర్‌తో విడాకులు కోరుతూ నాలుగు నెలల క్రితమే కోర్టుకు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
Details
అధికారిక ప్రకటన వెలువడలేదు
ఈ జంట పరస్పర అంగీకారంతో తమ వివాహాన్ని ముగించాలనుకుంటున్నట్లు సమాచారం.
ఉర్మిళా, మోసిన్ మధ్య ఉన్న వివాహం అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే 10 సంవత్సరాల చిన్నవాడు అయిన మోసిన్‌తో ఉర్మిళా 2016లో వివాహం చేసుకుంది.
ఈ జంట 8 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకునే దిశగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
మోసిన్ అక్తర్ మీర్ 2009లో 'ఇట్స్ ఎ మ్యాన్స్ వరల్డ్' సినిమా ద్వారా తన కెరీర్ ప్రారంభించాడు. తర్వాత వ్యాపారాలపై దృష్టి సారించారు.
ఉర్మిళా మటోండ్కర్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె 'రంగీలా' చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.