Loading...
Amitabh Bachchan: ప్రపంచం మనం చెప్పినట్లు నడవదు.. అమితాబ్‌ పోస్ట్‌ వైరల్‌!
ప్రపంచం మనం చెప్పినట్లు నడవదు.. అమితాబ్‌ పోస్ట్‌ వైరల్‌!

Amitabh Bachchan: ప్రపంచం మనం చెప్పినట్లు నడవదు.. అమితాబ్‌ పోస్ట్‌ వైరల్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ తన బ్లాగ్‌ ద్వారా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఏమీ లేనప్పుడు ఎన్నో కావాలని కోరుకుంటామని, తీరా అవన్నీ లభించిన తర్వాత వాటిని ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతామని పేర్కొన్నారు. కొన్నిరోజులుగా అమితాబ్‌ ఇంట్లో ఆస్తి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ పోస్ట్‌ ఆసక్తికరంగా మారింది.

వివనాలే

'దేవుడిని అడుగుతాం.. కానీ ఇంత ఎక్కువ కాదు'

మనం ఏదైనా పొందలేనప్పుడు దాని కోసం అడుగుతూనే ఉంటాం. ఏదో ఒకటి దొరికితే చాలు అనుకుంటాం. కానీ దేవుడి దయతో అన్నీ లభించినప్పుడు.. ఇంత వచ్చేసిందేంటి? వీటన్నింటినీ ఏం చేయాలి? అని ఆలోచిస్తాం.

ఇదే జీవిత సత్యం. అడగకుండానే అన్నీ వస్తున్నప్పుడు ఇలాగే భావిస్తాం. మనం దేవుడిని అడుగుతాం.. కానీ ఇంత ఎక్కువ కాదని అమితాబ్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

ప్రపంచమంతా మనం చెప్పినట్లు నడుచుకోదని ఆయన చమత్కరించారు.

మనం పరుగెత్తి ప్రపంచాన్ని అందుకోగలిగితే మంచిదేనని, ఒకవేళ అందుకోలేకపోతే ఎప్పటికీ వెనుకబడే ఉంటామని అభిప్రాయపడ్డారు.

వివరాలు

జల్సా ఇంటి యాజమాన్యంపై వివాదం

ముంబయిలోని అమితాబ్‌ నివాసం 'జల్సా' ప్రస్తుతం ఆస్తి వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ ఇంటి యాజమాన్య హక్కులను అమితాబ్‌ సోదరుడు అజితాబ్‌ బచ్చన్‌ భార్య రమోలా సవాల్‌ చేస్తున్నారు.

1993లో ఈ ఇంటిని అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌ పేరు మీద గిఫ్ట్‌ డీడ్‌ కింద బదిలీ చేశారు. అయితే, అంతకుముందు ఆ ఆస్తి తన పేరు మీదే ఉందని రమోలా ఆరోపిస్తున్నారు.

ఈ లావాదేవీ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, తన అనుమతి లేకుండానే గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా ఇంటిని సొంతం చేసుకున్నారని పేర్కొంటూ ఆమె ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో అమితాబ్‌ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ADVERTISEMENT